సదాశివపేట మండలం సూరారం గ్రామంలోని హజ్రత్ ఖాజే బందే నవాజ్ దర్గాలో 36వ ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సవాలలో భాగంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఖవాలీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మెన్ రామ్ రెడ్డి, సూరారం గ్రామ నాయకులు పాల్గొన్నారు.