సంగారెడ్డి పట్టణ శివారులోని వాసవి దేవాలయంలో గురువారం రాత్రి సహస్ర లింగార్చన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అర్చకులు వేదమంత్రాల పఠనంతో లింగార్చన కార్యక్రమాన్ని సంపూర్ణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు 'ఓం నమశ్శివాయ' అంటూ పెద్ద ఎత్తున నామస్మరణ చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్, కోశాధికారి జూలకంటి మల్లేశం, కార్య నిర్వాహక కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.