సంగారెడ్డి జిల్లాలో 365 పాఠశాలలు 100%
ఫలితాలు సాధించినట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు 5, కేజీబీవీ 16, బీసీ రెసిడెన్షియల్ 9, మైనార్టీ రెసిడెన్షియల్ 12, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 10, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 5, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ 2, మోడల్ స్కూల్స్ 9, జిల్లా పరిషత్ పాఠశాలలు 134, మరియు ప్రైవేట్ పాఠశాలలు 163 ఈ ఘనత సాధించాయని ఆయన పేర్కొన్నారు.