సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలలోని 256 వార్డులకు గాను మొత్తం 1045 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. ఆందోల్ జోగిపేటలో 63, గడ్డి పోతారం 72, గుమ్మడిదల 94, ఇంద్రేశం 76, ఇస్నాపూర్ 101, జిన్నారం 74, కోహిర్ 59, నారాయణఖేడ్ 57, సదాశివపేట్ 99, సంగారెడ్డి 176, జహీరాబాద్ 174 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల సంఖ్యపై కలెక్టర్ స్పష్టత ఇచ్చారు.