జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్-12లో 133 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం తెలిపారు. వివిధ శాఖల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 93 మంది యజమానులపై కేసు నమోదు చేశారు. బాల కార్మికులను గుర్తించినట్లయితే 1098 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.