అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా, దివ్యాంగుల క్రీడల నిధుల కోసం జిల్లాకు రూ. 2.60 లక్షలు మంజూరు అయ్యాయని సమగ్ర శిక్ష విలీన విద్య సమన్వయకర్త వెంకటేశం తెలిపారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక్కో మండలానికి రూ. 10,000 చొప్పున నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. భవిత కేంద్రాల వద్ద విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించాలని సూచించారు.