99 రోజుల 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక'లో భాగంగా, బాలల సంక్షేమం, యువత అభివృద్ధి కోసం భరోసా, ఎ. హెచ్. టి. యు, షీ-టీమ్ బృందాల ఆధ్వర్యంలో 6 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలల రక్షణ, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు.