దివ్యాంగుల హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య, దివ్యాంగుల ప్రత్యేక శాఖ కోసం తీసుకువచ్చిన జీవో నెంబర్ 34ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో శనివారం ఆయన మాట్లాడుతూ, ఐసిడిఎస్ నుంచి దివ్యాంగుల శాఖలను వేరు చేస్తామని ప్రభుత్వం మూడు నెలల క్రితం హామీ ఇచ్చినా, అది ఇంకా అమలు కాలేదని విమర్శించారు. ఈ జీవో అమలు చేయకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.