సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం యక్ష ప్రశ్న క్విజ్ పోటీలు జరిగాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ పాండు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు.