సంగారెడ్డి: అదనపు కట్నం వేధింపులు.. నవ వధువు ఆత్మహత్య

555చూసినవారు
సంగారెడ్డి: అదనపు కట్నం వేధింపులు.. నవ వధువు ఆత్మహత్య
అదనపు కట్నం వేధింపులతో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల ప్రకారం.. వికారాబాద్ సాకేత్ నగర్ కు చెందిన సాయికి సంగారెడ్డి జిల్లా మునిపల్లికి చెందన శ్రీజతో గతేడాది నవంబర్లో వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం భర్త వేధించ సాగాడు. డబ్బులు ఇచ్చే స్థితిలో మా వాళ్లు లేరని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సాయి వినలేదు. ఈ విషయం కుటుంబీకులు నిన్న ఫోన్లో చెప్పిన శ్రీజ అనంతరం ఇంట్లో ఉరేసుకుందన్నారు.

సంబంధిత పోస్ట్