సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని నేటివ్
ఇండియా ఛానల్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించి అవగాహన పత్రికను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు శనివారం అందజేశారు. తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.