సంగారెడ్డిలో స్విమ్మింగ్ పూల్ కోచ్ ఉద్యోగాల కోసం అర్హులైన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి శనివారం తెలిపారు. ఎన్ఐఎస్ ఫస్ట్ ఇయర్ సర్టిఫికెట్ కలిగి, 40 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులు. మార్చి 7వ తేదీలోపు కలెక్టరేట్ లోని క్రీడాభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. మరిన్ని వివరాలకు 7981798957 నంబర్ ను సంప్రదించవచ్చు.