సంగారెడ్డి పట్టణంలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ఆరుద్ర నక్షత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు ఉదయం నుంచే శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాల నడుమ అన్న పూజ, భస్మాభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు, దీనిలో అనేకమంది భక్తులు పాల్గొన్నారు.