ఫసల్వాదిలోని పాఠశాలలో విద్యార్థులకు పోక్సో, అత్యాచార చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి భరోసా కేంద్రం కో-ఆర్డినేటర్ బృందం పాల్గొని, పోక్సో చట్టం కింద నేరాలకు కఠిన శిక్షలు, బాధితులకు భరోసా కేంద్రం అందించే సేవలను వివరించింది. సోషల్ మీడియా దుష్ప్రభావాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.