సంగారెడ్డి పట్టణ బాబా నగర్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం నేడు అధ్వాన్నంగా మారింది. సంగారెడ్డి పట్టణ బాబా నగర్ 18 వార్డ్ శివారులో ఏర్పాటు చేసిన ఈ పార్కు నిర్వహణను మున్సిపాలిటీ పూర్తిగా గాలికొదిలేసింది. పార్కు ప్రధాన ద్వారం వద్దే ముళ్లపొదలు, కలుపు మొక్కలు దట్టంగా పెరిగిపోయాయి. లోపల ఉన్న జారుడు బల్లలు, ఆట వస్తువులు తుప్పు పట్టి పాడైపోయాయి. పిల్లలు ఆడుకునేందుకు వీలు లేకుండా గడ్డి, పిచ్చి మొక్కలు మోకాళ్ల లోతు పెరిగాయి. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.