సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్యరావు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావిణ్యాలను కలిసి వినతి పత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా ప్రమాదంలో మరణించిన ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇప్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.