సంగారెడ్డి పట్టణంలో చైనా మాంజా విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాము నాయుడు శనివారం తెలిపారు. పతంగుల దుకాణాలను తనిఖీ చేసిన పోలీసులు, చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని సూచించారు.