హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా, జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ సమావేశం జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలకు వేదికైంది.