ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రావిణ్యకు బహిరంగ లేఖను బుధవారం విడుదల చేశారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింలు, రమేష్ గౌడ్, మహేష్ పాల్గొన్నారు.