కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 12వ తేదీన కార్మిక, కర్షక సంఘాలు నిర్వహిస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ తెలిపారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ చట్టాలతో కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. ఈ సమ్మెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.