సంగారెడ్డి: విద్యాపీఠంలో దత్త జయంతి వేడుకలు

899చూసినవారు
సంగారెడ్డి మండలం ఫసల్ వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో గురువారం దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి శ్రీమహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి పాదాలను ఊరేగించారు. అనంతరం పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్