నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ టీఎన్జీవో ఆధ్వర్యంలో టీజీఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డికి బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని నిర్మల రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, కార్యదర్శి రవి పాల్గొన్నారు.