సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలో మీడియాతో ఆయన బుధవారం మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాత్రమే రెండు మున్సిపాలిటీలలో కనిపిస్తుందని తెలిపారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని, గత ప్రభుత్వం మంజూరు చేసిన హెచ్డిఎఫ్ నిధులను రద్దు చేసిందని ఆయన ఆరోపించారు.