సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రహమన్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను పరిరక్షించాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నినదించారు.