కుక్కలకు తప్పనిసరిగా టీకాలు ఇప్పించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడి డాక్టర్ వసంత కుమారి అన్నారు. సంగారెడ్డి లోని పశు వైద్యశాలలో జునోసిస్ డే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ లూయిస్ ఫ్యాక్చర్ 1985 జూన్ 6వ తేదీన రేబీస్ టీకాను కనుగొన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మునిర్ అహ్మద్ పాల్గొన్నారు.