మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, వాట్సాప్ లో పంపిన లింకు ద్వారా ఇంటి పన్ను చెల్లించవద్దని సూచించారు. ఇంటి పన్నును నేరుగా మున్సిపల్ కార్యాలయంలో లేదా ఇంటికి వచ్చే బిల్ కలెక్టర్ కు మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. పన్ను చెల్లించకుంటే పెనాల్టీ పడుతుందని, వెంటనే డబ్బులు పంపాలని స్కామర్లు ఫోన్లు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.