ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరగా అందేలా కృషి చేస్తామని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మంగళవారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమంలో ఎస్ఐ మొగులయ్య, ఆర్‌ఎస్‌ఐ ఖదీరుద్దీన్, పీసీ శ్రీనివాస్ రెడ్డిలను సన్మానించారు. రిటైర్మెంట్ అనంతరం వారు ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు.