సంగారెడ్డి: రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

564చూసినవారు
సంగారెడ్డి: రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల వద్ద గడ్డి వాములు, ఎండిన పంట అవశేషాలు ఉన్న చోట్ల చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100, 112 నంబర్లకు లేదా కంట్రోల్ రూమ్ 8712656739 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్