సంగారెడ్డి: 3. 51 లక్షల మందికి జ్వర సర్వే

73చూసినవారు
సంగారెడ్డి: 3. 51 లక్షల మందికి జ్వర సర్వే
జిల్లాలో 3, 51, 481 మందికి జ్వర సర్వే నిర్వహించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల గురువారం తెలిపారు. 98 శాతం జ్వర సర్వే పూర్తయినట్లు పేర్కొన్నారు. 7, 089 మందిని జ్వర బాధితులుగా గుర్తించినట్లు చెప్పారు. 43 డెంగ్యూ, 81 టైఫాయిడ్, 150 డయేరియా కేసులు నమోదైనట్లు వివరించారు. ప్రజలకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.