ఫసల్ వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆదివారం ఉచిత నృత్య, సంగీత శిక్షణ శిబిరం నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భరతనాట్యం, కూచిపూడిపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అందరూ నృత్యం నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు.