సంగారెడ్డి మండలం ఉగాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆదివారం ఉచిత నృత్య, సంగీత శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రతి ఒక్కరూ నృత్యం, సంగీతం నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు.