సంగారెడ్డి: రేపటి నుంచి విద్యాపీఠంలో ఉచిత శిక్షణ

1చూసినవారు
సంగారెడ్డి మండలం ఫసల్ వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈనెల 14వ తేదీ నుంచి ఉచిత సంగీత, నృత్య, కీబోర్డ్, తబలా శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. సంగీతంలో 57, నృత్యంలో 209, కీబోర్డులో 45, తబలాలో 25 మంది చొప్పున మొత్తం 336 మంది విద్యార్థులు ఈ శిక్షణకు ఎంపికయ్యారు.

సంబంధిత పోస్ట్