సంగారెడ్డి: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

2చూసినవారు
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం దివ్యాంగురాలి ఉద్యోగం పైనే చేశారని పేర్కొన్నారు. ఇది దివ్యాంగుల పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుందని ఆయన అన్నారు.