రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని టీజీఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. రైతు వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి లోని రైతు వేదికలు గురువారం సమావేశం నిర్వహించాయి. వచ్చే వర్షాకాలం పంటల కోసం రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.