స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈనెల 11వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభు గౌడ్ తెలిపారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో మంగళవారం నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.