సంగారెడ్డి: రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

8చూసినవారు
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని పీఎస్ఆర్ గార్డెన్లో ఈనెల 29న సాయంత్రం 6 గంటలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నట్లు వీర శైవ లింగాయత్ సమాజం జిల్లా అధ్యక్షుడు నర్సింలు తెలిపారు. రంగారెడ్డిలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇటీవల విజయం సాధించిన మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ వేడుకల్లో మహిళా సాధికారతను చాటిచెప్పేలా కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.