లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదర్శ సంగారెడ్డి నూతన కార్యవర్గాన్ని ఆదివారం సంఘ భవనంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కిరణ్ గౌడ్, కోశాధికారిగా వెంకటేశం ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.