సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని బ్లడ్ బ్యాంక్ వద్ద ఆదివారం ఒక 55 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పని నిమిత్తం అక్కడికి వచ్చిన వ్యక్తిని ఆసుపత్రి సిబ్బంది మృతదేహంగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే పట్టణ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సిఐ రామనాయుడు తెలిపారు.