సంగారెడ్డి: ట్యాంకర్ వెల్డింగ్ చేస్తుండగా వ్యక్తి మృతి

204చూసినవారు
సంగారెడ్డి: ట్యాంకర్ వెల్డింగ్ చేస్తుండగా వ్యక్తి మృతి
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని బుదేరా గ్రామంలో బుధవారం ఓ ట్యాంకర్కు వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో సదాశివపేట మండలం ఎన్కే పల్లి గ్రామానికి చెందిన ఫరీద్ (32) అనే వెల్డర్ తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ట్యాంకర్ పేలుడుతో భారీ శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పేలుడు ధాటికి ట్యాంకర్ భాగాలు ఎగిరిపడి రోడ్డుపై వెళ్తున్న కారు, లారీకి తాకి అద్దాలు ధ్వంసమయ్యాయి. మునిపల్లి ఎస్సె రాజేష్ నాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్