దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 13వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపట్టాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆడివయ్య పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులకు ప్రతి నెలా రూ. 6,000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షను జయప్రదం చేయాలని ఆయన కోరారు.