సంగారెడ్డి పట్టణంలో ఈనెల 9వ తేదీన జరిగే మెడికల్ యూనియన్ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం చైర్మన్ మల్లికార్జున్ తెలిపారు. సంగారెడ్డిలో మహాసభ పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. మెడికల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి, కార్మికులు పాల్గొన్నారు.