సిగాచి పరిశ్రమ ప్రమాదంలో ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభ్యం కాలేదని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదంలో 42 మంది మృతి చెందినట్లు చెప్పారు. 18 మంది వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. 61 మంది సురక్షితంగా ఉన్నారన్నారు. సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.