సంగారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బుధవారం బీఆర్ఎస్ మున్సిపల్ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ జెండా ఎగరవేసేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవినీతి లేని పాలన అందించడం బీఆర్ఎస్ పార్టీకి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.