భర్త మరణాన్ని తట్టుకోలేక, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన కంది మండలం జిలకర గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. జనవరిలో రోడ్డు ప్రమాదంలో భర్త మరణించడంతో, తీవ్ర మనోవేదనకు గురైన మమత (28) తన ఏడేళ్ల కుమారుడు మణికంఠ, ఐదేళ్ల కుమార్తె ప్రళయలకు విషం ఇచ్చి చంపింది. అనంతరం ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. డీఎస్పీ సత్తయ్య గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.