సంగారెడ్డి మున్సిపాలిటీ: ఇంటి, నీటి, వ్యాపార పన్నుల చెల్లింపుపై స్కామర్ల పట్ల అప్రమత్తత

1చూసినవారు
సంగారెడ్డి మున్సిపాలిటీ: ఇంటి, నీటి, వ్యాపార పన్నుల చెల్లింపుపై స్కామర్ల పట్ల అప్రమత్తత
సంగారెడ్డి పట్టణ గృహ మరియు వాణిజ్య యజమానులకు మున్సిపల్ కమీషనర్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇంటి పన్ను, నీటి కుళాయి పన్ను, వ్యాపార పన్నులను మున్సిపల్ కార్యాలయంలో లేదా బిల్ కలెక్టర్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. అయితే, సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్ ద్వారా పన్ను చెల్లింపు కోసం స్కానర్లు పంపి, డబ్బులు పంపమని కోరే స్కామర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొంతమంది స్కామర్లు ఫోన్ చేసి, పెనాల్టీ పడుతుందని వెంటనే డబ్బులు పంపాలని బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కావున ఎవరూ మోసపోవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సందేహాలుంటే కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్