సంగారెడ్డి నాయి బ్రాహ్మణులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలి

4చూసినవారు
సంగారెడ్డి నాయి బ్రాహ్మణులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలి
సంగారెడ్డిలోని సంఘ భవనంలో బుధవారం నాయి బ్రాహ్మణులను సన్మానించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచిన వారిని అభినందించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నాయి బ్రాహ్మణులు పోటీ చేసి విజయం సాధించాలని జిల్లా అధ్యక్షులు నాగభూషణం పిలుపునిచ్చారు. రాజకీయాల్లో రాణించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కిష్టయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్