సంగారెడ్డి జిల్లాలో మే 1 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా జిల్లాలో ఎక్కడైనా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆదేశాలు జిల్లా వ్యాప్తంగా అమలులో ఉంటాయి.