నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశ పరీక్ష ఈ నెల 7వ తేదీన జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఈ పరీక్షకు 9వ తరగతికి 853 మంది, 11వ తరగతికి 108 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఆయన చెప్పారు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.