రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మాణ రెడ్డి తెలిపారు. ఆదివారం సంగారెడ్డిలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి మహా సంస్థ చైర్మన్ తోపాజి అనంత కిషన్ కూడా పాల్గొన్నారు.