సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్
పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఈనెల 20వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలకు చివరి రోజు 10వ తరగతి అర్థశాస్త్రం పరీక్షకు ఐదుగురికి ఐదుగురు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ జీవశాస్త్రం, అర్థశాస్త్రం, మాస్ కమ్యూనికేషన్ పరీక్షలకు 4,021 మంది విద్యార్థులకు గాను 3,678 మంది హాజరైనట్లు జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి తెలిపారు. ఈ
పరీక్షలు విజయవంతంగా ముగిశాయి.